Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యుఏఇలో టి20 వరల్డ్‌కప్ ప్రపంచకప్: బిసిసిఐ
ముంబయి: ఒమన్ వేదికగా టి20 ప్రపంచకప్ అర్హత టోర్నీ, యుఏఇ వేదికగా టి20 ప్రపంచకప్ టోర్నమెంట్ జరుగుతాయని భారత క్రికెట్ కంట్రోల్‌బోర్డు(బిసిసిఐ) సోమవారం స్పష్టం చేసింది. సోమవారం జరిగిన బిసిసిఐ ఆఫీస్ బేరర్ల కాన్ఫరెన్స్ అనంతరం బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్‌లో టి20 వరల్డ్‌కప్ నిర్వహించలేమని, యుఏఇలో టోర్నీ జరుగుతుందని, ఒమన్‌లో టి20 అర్హత టోర్నీ జరుగుతుందని ఐసిసి తెలిపింది. టోర్నీ నిర్వహణకు సంబంధించి బిసిసిఐ తన నిర్ణయం తెలియజేయడానికి ఐసిసి ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది. రానున్న రెండు, మూడు నెలల్లో ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేమని, ఇండియా తర్వాత టి20 ప్రపంచకప్‌కు యుఏఇయే మంచి వేదికని, టోర్నీ తేదీల్లో ఎలాంటి మార్పులు లేవని తెలిపింది. మెగా టోర్నీ పోటీలు దుబారు, అబుదాబి, షార్జాల్లో జరుగుతాయని రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు.