Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రి క్వార్టర్స్‌లో బెల్జియం చేతిలో ఓటమి
సెవిల్లా(స్పెయిన్): యూరో ఫుట్‌బాల్ టోర్నమెంట్ ప్రి క్వార్టర్ఫైనల్లో క్రిస్టియానో రొనాల్డో సారథ్యంలో పోర్చుగల్ అనూహ్యంగా పరాజయాన్ని చవిచూసింది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన పోటీలో పోర్చుగల్ 0-1 తేడాతో బెల్జియం చేతిలో ఓడింది. బెల్జియం తరఫున ఏకైక గోల్‌ను థోర్గాన్(42వ ని.)లో కొట్టాడు. ఈ మ్యాచ్ మొత్తం పోర్చుగల్ ఆధిపత్యం కొనసాగింది. 23షాట్స్‌లో పోర్చుగల్ గోల్ టార్గెట్ షాట్స్ 4 కొట్టినా ప్రయోజనం లేకపోయింది. బెల్జియం జట్టు 6 షాట్స్‌లో ఒక టార్గెట్ షాట్‌ను గోల్‌గా మలిచి గెలుపొందడం విశేషం. బంతి 58శాతం పోర్చుగల్ ఆధీనంలో ఉండగా.. ఆ జట్టుకు 3 పెనాల్టీ కార్నర్లు కూడా లభించాయి. అంతకుముందు జరిగిన మరో మ్యాచ్‌లో చెక్ జట్టు 2-0తో మాజీ ఛాంపియన్ నెదర్లాండ్స్‌ను చిత్తు క్వార్టర్ఫైనల్లోకి దూసుకొచ్చింది. క్వార్టర్స్్లో చెక్ జట్టు డెన్మార్క్‌తో, ఇటలీ జట్టు బెల్జియంతో తలపడనున్నాయి.
యూరోలో నేడు..
ఇంగ్లండ్ × జర్మనీ
(రా. 9.30 గం||లకు)
స్వీడన్ × ఉక్రెయిన్
(రా.12.30 గం||లకు)