Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల స్వర్ణపతక విజేత రాహి షర్నోబత్ క్రొయేషియా వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ షూటింగ్ పోటీల్లో సత్తా చాటింది. సోమవారం జరిగిన మహిళల 25మీ. పిస్టల్ విభాగంలో షర్నోబత్ స్వర్ణ పతకాన్ని గెల్చింది. రెండుసార్లు పర్ఫెక్ట్-5 పాయింట్లు సాధించిన 30ఏళ్ల షర్నోబత్ 2013, 2019 ప్రపంచకప్ షూటింగ్ పోటీల్లో స్వర్ణం గెల్చింది. సోమవారం ఫైనల్లో ఫ్రాన్స్‌కు చెందిన మథిల్డే లామోల్లెపై 8 పాయింట్ల తేడాతో గెలిచింది. ఫైనల్‌కు చేరే క్రమంలో రాహి 296(ర్యాపిడ్ ఫైర్) పాయింట్లతో కలిపి మొత్తం 591 పాయింట్లతో స్వర్ణ పతకం గెల్చింది. ఇక మను బకర్ 296(ర్యాపిడ్ ఫైర్) సాధించినా.. మొత్తం 588 పాయింట్లతో 7వ స్థానంతో సరిపుచ్చుకుంది. ఇక ఒలింపిక్ ఛాంపియన్ అన్నా కరకాకి 5వ స్థానానికే పరిమితం కాగా.. 25మీ. పిస్టల్ మహిళల డబుల్స్‌లో రాహి-మను ఫైనల్‌కు చేరారు.