Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాక్సింగ్ ఫెడరేషన్ ప్రతిపాదన
న్యూఢిల్లీ: ఒలింపిక్ బౌండ్ బాక్సర్లు సిమ్రన్‌జిత్ కౌర్, గౌరవ్ సోలంకీ, సోనియా చాహల్‌లను బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అర్జున అవార్డుకు ప్రతిపాదించింది. ఫెడరేషన్ సోమవారం ఓ ప్రకటనలో.. గత నాలుగేళ్లలో వీరందరి ప్రదర్శనను పరిగణనలోకి తీసుకొనే వారి పేర్లను అర్జునకు నామినేట్ చేసినట్లు పేర్కొంది. 2018 ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ మహిళల 60కిలోల విభాగంలో సిమ్రన్‌జిత్ కాంస్య పతకం గెల్చిందని, ఆమెను ఆదర్శంగా తీసుకొని మరో నలుగురు బాక్సర్లు ఒలింపిక్స్‌కు అర్హత సాధించారని పేర్కొంది. ఇక పురుషుల 57కిలోల విభాగంలో గౌరవ్ సోలంకీ 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం గెలిచాడని, సోనియా చాహల్ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ మహిళల విభాగంలో రజిత పతకంతో పాటు మాజీ జాతీయ ఛాంపియన్ అని ఆ ప్రకటనలో పేర్కొంది. ఈ ముగ్గురితో తుది జాబితాను అర్జునకు ప్రతిపాదిస్తున్నట్లు బిఎస్ఎఫ్ జనరల్ సెక్రటరీ హేమంత కలిత తెలిపారు.