Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వర్షంతో 16 మ్యాచ్‌లు రద్దు
- వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ
లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో టాప్‌సీడ్ నొవాక్ జకోవిచ్, 3వ సీడ్ సిట్సిపాస్ శుభారంభం చేశారు. సోమవారం నుంచి ప్రారంభమైన వింబుల్డన్ తొలిరౌండ్ పోటీలో జకోవిచ్ 4-6, 6-1, 6-2, 6-2 తేడాతో బ్రిటన్‌కు చెందిన 19ఏళ్ళ జాక్ డ్రాపెర్ను చిత్తుచేశాడు. తొలి సెట్‌ను డ్రాపర్ 6-4తో చేజిక్కించు కోవడంతో రెండసెట్నుంచి జకోవిచ్ తన పూర్వఫామ్‌ను ప్రదర్శించి మ్యాచ్‌ను ముగించాడు. ఇక మహిళల సింగిల్స్‌లో 2వ సీడ్ అర్నా సబలెంకో(బెలారస్) 6-1, 6-4తో మోనికా నికలస్కూ(రొమేనియా)ను చిత్తుచేసి రెండోరౌండ్లోకి ప్రవేశించింది.
16మ్యాచులు రద్దు..
రెండేళ్ల విరామం అనంతరం తిరిగి ప్రారంభమైన వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌కు వర్షం అడ్డంకిగా నిలిచింది. సోమవారం మొత్తం 64 తొలిరౌండ్ పోటీలు జరగాల్సి ఉండగా.. అందులో బహిరంగ ప్రదేశాల్లో జరిగే 16 మ్యాచులను రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీలన్నీ మంగళవారం జరగనున్నాయి. సెంటర్ కోర్ట్, ఇండోర్ వేదికల్లో జరిగే పోటీలు మాత్రమే జరిగాయి. 2020 సీజన్ టోర్నమెంట్ రద్దు కాగా.. ఈసారి 100% ప్రేక్షకులకు గ్రాండ్‌స్లామ్ నిర్వాహకులు అనుమతివ్వడం విశేషం.