Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దుబారు: ఈ ఏడాది భారత్ వేదికగా జరగాల్సిన టి20 ప్రపంచకప్ యుఏఇ వేదికగా జరగనున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) మంగళవారం అధికారికంగా ప్రకటించింది. ట్విట్టర్లో వేదిక మార్పును ఐసిసి పోస్టు చేసింది. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు టి20 ప్రపంచకప్ జరగనుందని, కరోనా వైరస్ దృష్ట్యా వేదికను మార్చాలి వచ్చిందని, దుబారు ఇంటర్నేషనల్ స్టేడియం, ది షేక్ జయిదా స్టేడియం(అబుదాబి), ది షార్జా స్టేడియంలో మెగా టోర్నీ సంగ్రామం జరగనుందని వెల్లడించింది. ఒమన్ వేదికగా మెయిన్ డ్రా అర్హత పోటీలు బంగ్లాదేశ్, శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, స్కాట్‌ల్యాండ్, నమీబియా, ఒమన్, పపున్యుగేనియా మధ్య జరగనున్నాయని, వీటిలో నాలుగు జట్లు మెయిన్ డ్రాకు అర్హత సాధిస్తాయని పేర్కొంది. టి20 వరల్డ్‌కప్‌ను సురక్షితమైన వాతావరణంలో నిర్వహించడమే తమ ఉద్దేశమని ఐసిసి తాత్కాలిక సిఇవో జెఫ్ అలర్ డైస్ తెలిపారు.