Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: అర్జున అవార్డుకు అంకిత రైనా, ప్రజ్ఞేశ్ గుణేశ్వరన్లను ఆలిండియా టెన్నిస్ అసోసియేషన్(ఐటా) మంగళవారం ప్రతిపాదించింది. అంకిత రైనా, ప్రజ్ఞేశ్ 2018 ఆసియా క్రీడల్లో కాంస్య పతకాలు గెలిచారు. ఇక ప్రజ్ఞేశ్ గుణేశ్వరన్ 2019లో నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీల మెయిన్ డ్రాకు అర్హత సాధించాడు. టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో అంకిత సింగిల్స్ 182, డబుల్స్‌లో 95వ ర్యాంక్‌లో కొనసాగుతోంది. ప్రజ్ఞేశ్ సింగిల్స్‌లో 148వ ర్యాంక్‌లో ఉన్నాడు. వెటరన్ టెన్నిస్ ఆటగాడు 73ఏళ్ల బల్రామ్ సింగ్‌కు రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డుకు ఐటా సిఫార్సు చేసింది. గత ఏడాది దివిజ్ శరణ్‌కు ఐటా ప్రతిపాదించిన అర్జున అవార్డు దక్కింది. అలాగే బల్రామ్ సింగ్, ఎన్రికో పిపెర్నోలను ఢ్యాన్చంద్ అవార్డులకు ప్రతిపాదిస్తున్నట్లు ఐటా ఓ ప్రకటనలో పేర్కొంది.