Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: భారత మహిళా జిమ్నాస్ట్ ప్రణతి నాయక్ జాక్‌పాట్ కొట్టింది. ప్రణతికి టోక్యో ఒలింపిక్స్ బెర్త్ ఖరారు చేస్తూ అంతర్జాతీయ జిమ్నాస్టిక్ ఫెడరేషన (ఎఫ్ఐజి).. జిమ్నాస్టిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (జిఎఫ్ఐ)కు మంగళవారం లేఖ పంపింది. 2019 ఆసియా ఛాంపియన్‌షిప్‌లో ప్రణతి కాంస్య పతకం గెల్చుకోవడంతో 2020లో ఖండాంతర పోటీల్లో పాల్గొనే అవకాశం దక్కింది. ఆ తర్వాత టోక్యో బెర్త్‌లే లక్ష్యంగా జరగాల్సిన ఆసియా ఛాంపియన్షిప్ రద్దు కావడంతో గత ఒలింపిక్స్‌లో ప్రాతినిధ్యం వహించిన దీపా కర్మాకర్ ఆశలు అడియాశలయ్యాయి. దీంతో 2016 రియో ఒలింపిక్స్‌లో ప్రాతినిధ్యం వహించిన దీపా తర్వాత పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రణతి రెండో జిమ్నాస్ట్‌గా ఒలింపిక్స్‌లో పాల్గోనుంది.