Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్విట్జర్లాండ్ చేతిలో పరాజయం
బుచారెస్ట్(రొమేనియా): రెండుసార్లు ఫిఫా ప్రపంచకప్(1998, 2018) టైటిళ్ల విజేత ఫ్రాన్స్ యూరో ఫుట్‌బాల్ టోర్నీ ప్రి క్వార్టర్స్‌లో అనూహ్యంగా పరాజయాన్ని చవిచూసింది. సోమవారం అర్ధరాత్రి జరిగిన పోటీలో ఫ్రాన్స్ పెనాల్టీ షూటౌట్లో 4-5 గోల్స్ తేడాతో స్విట్జర్లాండ్ చేతిలో ఓడింది. మ్యాచ్ ముగియడానికి 10 నిమిషాల ముందు వరకు ఫ్రాన్స్ 3-1 గోల్స్ ఆధిక్యతలో నిలిచింది. ఆ తర్వాత స్విట్జర్లాండ్ వరుసగా 2 గోల్స్ చేయడంలో నిర్ణీత సమయానికి ఇరుజట్లు 3-3 గోల్స్‌తో సమంగా నిలిచాయి. అదనపు సమయంలోనూ ఫ్రాన్స్, బెల్జియం జట్లు మరో గోల్ చేయకపోవడంతో పెనాల్టీ షూటౌట్‌కు దారితీసింది. షూటౌట్లో ఫ్రాన్స్‌కు చెందిన కైలియన్ ఎంబప్పే(10 జెర్సీ) గోల్ కొట్టలేకపోయాడు. దీంతో స్విట్జర్లాండ్ 5-4 గోల్స్ తేడాతో గెలిచి క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించింది. అంతకుముందు జరిగిన మరో పోటీలో స్పెయిన్ జట్టు 5-3 గోల్స్ తేడాతో క్రొయేషియాను చిత్తుచేసింది. జులై 2న జరిగే క్వార్టర్ఫైనల్లో స్విట్జర్లాండ్ జట్టు స్పెయిన్‌తో తలపడనుంది.