Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గాయంనుంచి కోలుకొని నాలుగేళ్ల తర్వాత సింగిల్స్ బరిలోకి
- వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్
లండన్: రెండుసార్లు వింబుల్డన్ ఛాంపియన్, 2017 తర్వాత సింగిల్స్ బరిలోకి దిగిన స్థానిక ఆటగాడు ఆండీ ముర్రే తొలిరౌండ్ పోటీలో విజయం సాధించాడు. సోమవారం అర్ధరాత్రి సెంటర్ కోర్టులో జరిగిన పోటీలో ముర్రే 6-4, 6-3, 5-7, 6-3తో 24వ సీడ్ బాసిలాష్విలి(జార్జియా)ను చిత్తుచేశాడు. 2013, 2016లో వింబుల్డన్ టైటిల్స్ నెగ్గిన ముర్రే 2017నుంచి తీవ్ర గాయాలతో నాలుగేళ్లుగా టెన్నిస్‌కు దూరంగా ఉన్నాడు. మాజీ నంబర్ ఆటగాడైన ముర్రే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 118వ స్థానంలో ఉన్నాడు. రెండో రౌండ్లో ఫ్రాన్స్‌కు చెందిన ఆథర్ రిండెర్నెచ్తో తలపడనున్నాడు. ఇతర పోటీల్లో 4వ సీడ్ జ్వెరేవ్(జర్మనీ) 6-3, 6-4, 6-1తో గ్రిక్స్ఫూర్(నెదర్లాండ్స్)ను, అన్‌సీడెడ్ కొర్డా(అమెరికా) 6-3, 6-4, 6-7(5-7), 7-6(7-5)తో 15వ సీడ్ డీ-మినర్(ఆస్ట్రేలియా)ను చిత్తుచేశాడు. మంగళవారం జరగాల్సిన పోటీలకూ వర్షం అడ్డంకిగా నిలిచాడు.
బార్టీ, ప్లిస్కోవా ముందంజ
మహిళల సింగిల్స్‌లో టాప్‌సీడ్, ఆస్ట్రేలియాకు చెందిన అస్ట్లే బార్టీ శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన తొలిరౌండ్ పోటీలో బార్టీ 6-1, 6-7(1-7), 6-1తో సురేజ్ నవ్వారో(స్పెయిన్)ను చిత్తుచేయగా.. 8వ సీడ్ ప్లిస్కోవా(చెక్ రిపబ్లిక్) 7-5, 6-4తో 2021 ఫ్రెంచ్ ఓపెన్ సెమీఫైనలిస్ట్ జిందాన్సేక్(స్లొవేనియా)ను ఓడించింది. మరో పోటీలో వీనస్ విలియమ్స్(అమెరికా) 7-5, 4-6, 6-3తో బజమెస్కూ(రొమేనియా)ను, ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ సెమీఫైనలిస్ట్ సక్కారి(గ్రీక్) 6-1, 6-1తో అరాంట్క్సా(నెదర్లాండ్స్)ను, 13వ సీడ్ మెర్టెన్స్(బెల్జియం) 6-1, 6-3తో డార్ట్(బ్రిటన్)ను చిత్తుచేసి రెండోరౌండ్లోకి ప్రవేశించారు.