Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బొలీవియాపై 4-1తో అర్జెంటీనా గెలుపు
- కోపా అమెరికా టోర్నమెంట్
బ్రసిలియా(బ్రెజిల్): కోపా అమెరికా టోర్నమెంట్ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో అర్జెంటీనా స్టార్ లియోనాల్ మెస్సీ రెండు గోల్స్‌తో కదం తొక్కాడు. మంగళవారం జరిగిన పోటీలో అర్జెంటీనా జట్టు 4-1 గోల్స్ తేడాతో బొలీవియాను చిత్తుచేసి క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించింది. అర్జెంటీనా తరఫున 148వ మ్యాచ్ ఆడుతున్న మెస్సీ(33వ ని.) పెనాల్టీని గోల్‌గా మలచగా.. మరో గోల్‌ను 42వ ని.లో కొట్టాడు. గోమెజ్ (6వ ని.), లటారో మార్టినేజ్(65వ ని.) ఒక్కో గోల్ కొట్టారు. బొలీవియా తరఫున ఏకైక గోల్‌ను ఎన్విన్(60వ ని.) కొట్టాడు. మరో మ్యాచ్‌లో ఉరుగ్వే జట్టు 1-0తో పరాగ్వేను చిత్తుచేసి క్వార్టర్స్ బెర్త్ ఖాయం చేసుకుంది. నేటితో కోపా అమెరికా లీగ్ పోటీలు ముగియగా.. శనివారంనుంచి క్వార్టర్‌ఫైనల్ పోటీలు జరగనున్నాయి.
క్వార్టర్‌ఫైనల్స్..
జులై 3(శని) : పెరూ × పరాగ్వే(తె.2.30గం||లకు)
బ్రెజిల్ × చిలీ(ఉ.5.30గం||లకు)
జులై 4(ఆది) : ఉరుగ్వే × కొలంబియా(తె.3.30గం||లకు)
అర్జెంటీనా × ఈక్వెడార్(ఉ.6.30గం||లకు)