Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గ్రెనడా: మూడో టి20లో దక్షిణాఫ్రికా జట్టు ఒక్క పరుగు తేడాతో వెస్టిండీస్‌ను చిత్తుచేసింది. మంగళవారం అర్ధరాత్రి జరిగిన పోటీలో తొలిగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఓపెనర్ డికాక్(72), డుస్సేన్(32) రాణించగా.. మెక్ కారు(4/22), బ్రేవో(3/25) బౌలింగ్‌లో మెరిసారు. అనంతరం వెస్టిండీస్ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులే చేసి పరాజయాన్ని చవిచూసింది. ఆఖరి ఓవర్లో విండీస్ 15 పరుగులు చేయాల్సి ఉండగా.. రబాడా వేసిన ఓవర్లో 13 పరుగులు మాత్రమే రాబట్టింది. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ షాంమ్సీ(2/13)కు దక్కగా.. ఐదు టి20ల సిరీస్‌లో దక్షిణాఫ్రికా 2-1 ఆధిక్యతలో నిలిచింది. అంతకుముందు జరిగిన మరో ఉత్కంఠ పోటీలో ఇంగ్లండ్ 2-0తో జర్మనీని చిత్తుచేసి క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించింది.