Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి: ఒలింపిక్ బౌండ్ ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు పివి సింధు, సాత్విక్ సాయిరాజ్, రజనీలకు ఏపీి ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సిఎం కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఒక్కొక్కరికి రూ. 5లక్షలు చొప్పున చెక్‌లను అందజేశారు. విశాఖలో బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుకు ప్రభుత్వం కేటాయించిన రెండు ఎకరాల భూమికి సంబంధించిన జివో కాపీని సింధుకు ముఖ్యమంత్రి అందజేశారు. సాత్విక్ సాయిరాజ్ ఏపీి సీిఎం చేతులమీదుగా అందుకోగా.. చిత్తూరుజిల్లాకు చెందిన రజనీ(మహిళల హాకీ) బెంగళూరులో శిక్షణలో ఉన్న నేపథ్యంలో ఆమె కుటుంబ సభ్యులు నగదు చెక్‌ను అందజేశారు. ఈ సందర్భంగా సింధు ట్విటర్ వేదికగా ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. 'క్రీడల అభివృద్ధికి నిరంతరం ప్రోత్సహిస్తూ మమ్మల్ని ఉత్సాహపరుస్తున్న ఏపీిి సీిఎం జగన్‌కు ఇవే నా ధన్యవాదాలు. మా మూలాలను గుర్తించి మమ్మల్ని గౌరవిస్తూ మీరిచ్చే ప్రోత్సాహం ఎల్లప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా'' అంటూ ట్వీట్ చేశారు. జులై 23 నుంచి ఆగష్టు 8వరకు జపాన్ టోక్యో వేదికగా ఒలింపిక్స్ జరగనున్నాయి.