Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: భారత స్విమ్మర్ శ్రీహరి నటరాజ్‌కు టోక్యో బెర్త్ దక్కింది. ప్రపంచ స్విమ్మింగ్స్ గవర్నింగ్ బాడీ(ఎఫ్ఐఎన్ఏ) బుధవారం ఓ ప్రకటనలో 100మీ. బ్యాక్స్టోక్లో 'ఏ' స్టాండర్డ్‌ను అందుకోవడంతో ఒలింపిక్స్ ప్రమాణాలు అందుకున్నట్లు ధృవీకరించింది. ఇటీవల జరిగిన సెట్టె కొల్లి ట్రోఫీ స్విమ్మింగ్ పోటీలో శ్రీహరి 100మీ. బ్యాక్స్స్టోక్ 53.77సెకన్లలో గమ్యానికి చేరి రెండోస్థానంలో నిలిచాడు. దీంతో భారత స్విమ్మింగ్ సమాఖ్య ఎఫ్ఐఎన్ఏకు శ్రీహరి పేరును ప్రతిపాదించింది. దీంతో టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ తరఫున సాజన్ ప్రకాశ్‌తో కలిసి శ్రీహరి ప్రాతినిధ్యం వహించనున్నట్లు స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా బుధవారం ట్వీట్ చేసింది.
ఒలింపిక్స్‌కు ద్యూతీ అర్హత
భారత మహిళా స్ప్రింటర్ ద్యూతీ చంద్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. బుధవారం ప్రకటించిన ర్యాంకింగ్స్ ఆధారంగా 100మీ. 200మీ. పరుగులో ద్యూతీకి ఒలింపిక్ కోటా దక్కింది. 100మీ. పరుగులో టాప్-22లోపు, 200మీ. పరుగులో టాప్-15లోపు ఉన్న అథ్లెట్లకు నేరుగా ఒలింపిక్ బెర్త్ దక్కుతుంది. ఇందులో కొంతమంది ఒలింపిక్స్‌కు దూరంగా ఉండడం ద్యూతీకి కలిసొచ్చింది. తాజా ర్యాంకింగ్స్‌లో ద్యూతీ 100మీ. పరుగులో 44, 200మీ. పరుగులో 51వ స్థానంలో నిలిచింది. ద్యూతీ 100మీ. పరుగులో కెరీర్ బెస్ట్ 11.17సె. కాగా.. 200మీ. పరుగులో 23.00సెకన్లుగా ఉంది.