Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ మూడోరౌండ్‌కు టాప్‌సీడ్, సెర్బియాకు చెందిన నొవాక్ జకోవిచ్, బల్గేరియాకు చెందిన 18వ సీడ్ డిమిట్రోవ్ ప్రవేశించారు. బుధవారం జరిగిన రెండోరౌండ్ పోటీల్లో జకోవిచ్ 6-3, 6-3, 6-3తేడాతో అండర్సన్(దక్షిణాఫ్రికా)ను వరుససెట్లలో ఓడించాడు. ఇతర పోటీల్లో డిమిట్రోవ్ 3-6, 6-3, 6-4, 6-4తో వెడరాస్కూ(స్పెయిన్)ను, 23వ సీడ్ సొనేగో(ఇటలీ) 6-2, 7-5, 6-0తో పెడ్రో సోస్(పోర్చుగల్)ను ఓడించాడు. వర్షంతో వాయిదా పడ్డ తొలిరౌండ్ పోటీల్లో సీడెడ్ ఆటగాళ్లు పరాజయాల్ని చవిచూశారు. 28వ సీడ్ ఇస్నర్(అమెరికా) 6-7(5-7), 6-2, 3-6, 6-7(3-7), 4-6తో నిషికోరి(జపాన్) చేతిలో, 11వ సీడ్ బూస్టా(స్పెయిన్) 6-7(6-8), 4-6, 5-7తేడాతో క్వెర్రీ(అమెరికా) చేతిలో, 20వ సీడ్ కరక్సేవ్(6-7(4-7), 6-7(6-8), 3-6)తో కార్డీ(ఫ్రాన్స్) చేతిలో పరాజయాల్ని చవిచూశారు.