Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐసిసి టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల
దుబారు: అంతర్జాతీయ క్రికెట్‌మండలి(ఐసిసి) టెస్ట్ బ్యాట్స్మన్ల ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ మరోసారి అగ్రస్థానంలోకి దూసుకొచ్చాడు. ఐసిసి బుధవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో విలియ్సన్ 901 రేటింగ్ పాయింట్లతో టాప్‌లో నిలిచాడు. ఇప్పటివరకూ అగ్రస్థానంలో ఉన్న స్టీవ్ స్మిత్(ఆస్ట్రేలియా) 891 పాయింట్లతో రెండో స్థానానికే పరిమితం కాగా.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి నాలుగో స్థానంలోనే కొనసాగుతున్నాడు. ఇక ఆల్‌రౌండర్ల జాబితాలో ఉన్న రవీంద్ర జడేజా.. తాజా ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి పడిపోగా.. విండీస్ ప్లేయర్ జేసన్ హోల్డర్ మళ్లీ టాప్‌లోకి వెళ్లాడు.