Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగిసిన యూరో ప్రి క్వార్టర్స్ పోటీలు
హాంప్డెన్పార్క్(స్కాట్లాండ్): యూరో ఫుట్‌బాల్ టోర్నీ ఆఖరి ప్రి క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లో ఉక్రెయిన్ జట్టు స్వీడన్‌కు చెక్ పెట్టింది. కొద్ది క్షణాల్లో మ్యాచ్ ముగియడానికి ముందు స్వీడన్ గోల్ సమర్పించుకొని చేజేతులా పరాజయం పాలైంది. మంగళవారం అర్ధరాత్రి జరిగిన పోటీలో ఉక్రెయిన్ 2-1 గోల్స్ తేడాతో స్వీడన్‌ను ఓడించింది. రెండు అర్ధభాగాలు పూర్తయ్యే సరికి ఇరుజట్లు 1-1తో సమంగా నిలిచాయి. ఉక్రెయిన్ తరఫున అలెగ్జాండర్(27వ ని.)లో ఓ గోల్ కొట్టగా.. స్వీడన్ ఆటగాడు ఫోర్స్‌బెర్గ్(43వ ని.) ఒక గోల్ కొట్టారు. ఇరుజట్లు ప్రథమార్థంలోనే ఒక్కో గోల్ కొట్టాయి. ఆ తర్వాత ద్వితీయార్థంలో ఇరుజట్లు గోల్ చేయడంలో విఫలమయ్యాయి. ఫలితం కోసం అదనపు సమయం కేటాయించగా.. స్వీడన్ ఆటగాడు మార్కస్(99వ ని.) రెడ్‌కార్డ్‌కు గురై మైదానాన్ని వీడాడు. దీంతో ఆ జట్టు 10మంది ఆటగాళ్లతోనే మిగతా మ్యాచ్‌ను ఆడాల్సి వచ్చింది. మ్యాచ్ ముగియడానికి చివరి క్షణాల్లో(121వ ని.)లో ఉక్రెయిన్ ఆటగాడు ఆర్టెన్ గోల్ కొట్టి మ్యాచ్‌ను ముగించాడు.
క్వార్టర్‌ఫైనల్స్..
జులై 2 : స్విట్జర్లాండ్ × స్పెయిన్(రా.9.30గం||లకు), బెల్జియం × ఇటలీ(రా.12.30గం||లకు)
జులై 3 : చెక్ రిపబ్లిక్ × డెన్మార్క్ (రా.9.30గం||లకు), ఉక్రెయిన్ × ఇంగ్లండ్(రా. 12.30గం||లకు