Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: భారత మహిళల వన్డేక్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్, టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేర్లను రాజీవ్‌గాంధీ ఖేల్ రత్న అవార్డుల కోసం బిసిసిఐ ప్రతిపాదించింది. అర్జున్ అవార్డు కోసం పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, ఓపెనర్ శిఖర్ ధావన్ పేర్లను బిసిసిఐ సిఫార్సు చేసింది. అంతర్జాతీయ క్రికెట్లో మిథాలీరాజ్ 22ఏళ్లుగా కొనసాగుతూ.. వన్డేల్లో 7000కు పైగా పరుగులు చేసింది. ఇక సీనియర్ స్పిన్నర్ అశ్విన్ 79 టెస్టుల్లో 413, వన్డేల్లో 150, టి20ల్లో 42వికెట్లు తీశాడు. అలాగే భారత రెజ్లింగ్ సమాఖ్య అర్జున అవార్డుకోసం నలుగురి పేర్లను ప్రతిపాదించింది. ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో పతకాలు గెలిచిన రవి దహియా, దీపక్ పునియా, అన్షు మలిక్, సరిత పేర్లను సిఫార్సు చేసింది. క్రీడా అవార్డుల దరఖాస్తుకు గడువు(జూన్ 21)ను ముడిగించిన సంగతి తెలిసిందే.