Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హెచ్ఎఫ్ఐ అధ్యక్షుడు జగన్ ప్రకటన
జైపూర్ : పురుషుల విభాగంలో మాదిరిగానే అమ్మాయిలకు సైతం ప్రొ లీగ్‌ను నిర్వహిస్తున్నట్టు జాతీయ హ్యాండ్‌బాల్ సమాఖ్య (హెచ్ఎఫ్ఐ) అధ్యక్షుడు జగన్మోహర్ రావు తెలిపారు. బుధవారం జైపూర్‌లో హెచ్ఎఫ్ఐ వార్షిక ఎగ్జిక్యూటివ్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 'బ్లూస్పోర్ట్స్ ఎంట ర్టైన్మెంట్ కంపెనీతో హెచ్ఎఫ్ఐ గత డిసెంబర్లోనే పురుషుల లీగ్‌కు ఒప్పందం కుదుర్చుకుంది. అదే తరహాలో మహిళలకు సైతం ప్రొ లీగ్ నిర్వహిస్తాం. కరోనా కారణంగా మెన్స్ ప్రొ లీగ్ వాయిదా పడింది. పరిస్థితులు కుదుటపడిన అనంతరం లీగ్ షెడ్యూల్ విడుదల చేస్తాం' అని జగన్ పేర్కొన్నారు. మెన్స్ ప్రొ లీగ్‌కు జైపూర్ ఆతిథ్యం ఇవ్వనుండగా... మహిళల ప్రొ లీగ్ వేదికను త్వరలోనే ప్రకటించనున్నారు.