Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండో వన్డేలో అమ్మాయిల ఓటమి
టాంటన్ : వన్డే సిరీస్‌లో భారత్ ఆశలు గల్లంతు. మూడు మ్యాచుల సిరీస్‌లో మరో వన్డే ఉండగానే సిరీస్ ఇంగ్లాండ్ వశమైంది. రెండో వన్డేలో 5 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ మహిళలు విజయం సాధించారు. కెప్టెన్ మిథాలీరాజ్ (59, 92 బంతుల్లో 7 ఫోర్లు), షెఫాలీ వర్మ (44, 55 బంతుల్లో 7 ఫోర్లు) రాణించటంతో తొలుత భారత మహిళలు 221/10 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్ కేట్ క్రాస్ (5/34) ఐదు వికెట్ల ప్రదర్శనతో భారత్‌ను నిలువరించింది. ఛేదనలో సోఫియా డంక్లీ (73 నాటౌట్, 81 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), కేథరిన్ బ్రంట్ (33 నాటౌట్, 46 బంతుల్లో 3 ఫోర్లు) కదంతొక్కటంతో 15 బంతులు ఉండగానే ఇంగ్లాండ్ లాంఛనం ముగించింది. సిరీస్‌లో నామమాత్రపు మూడో వన్డే శనివారం జరుగనుంది.