Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కనీసం రెండు నెలల విశ్రాంతి
సౌథాంప్టన్ : కాలు గాయంతో ఇబ్బంది పడుతున్న భారత యువ టెస్టు ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు పూర్తిగా కానున్నాడు. న్యూజిలాండ్‌తో ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో గాయపడిన శుభ్‌మన్ గిల్.. మోకాలు కింద భాగంలో నొప్పిని ఆలస్యంగా నివేదించాడు. శుభ్‌మన్ గిల్‌కు తదుపరి పరీక్షలు నిర్వహించిన బీసీసీఐ వైద్య బృందం అతడికి కనీసం రెండు నెలల విశ్రాంతి అవసరమని తేల్చినట్టు సమాచారం. ' శుభ్‌మన్ గిల్‌కు షిన్ స్ట్రెస్ ఫ్రాక్చర్ అయ్యింది. ఈ గాయంతో అతడు కనీసం రెండు నెలలు ఆటకు దూరంగా ఉండాల్సి వస్తుంది' అని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. గిల్ గాయం తీవ్రత దృష్ట్యా ఇంగ్లాండ్‌తో తొలి మూడు టెస్టుల్లో కచ్చితంగా ఆడలేడు. ఇప్పటికే టెస్టు జట్టులో మయాంక్ అగర్వాల్, కెఎల్ రాహుల్ రూపంలో మరో ఇద్దరు ఓపెనర్లు అందుబాటులో ఉన్నారు. శుభ్‌మన్ గిల్‌ను స్వదేశానికి పలిచి, అతడి స్థానంలో మరో ఆటగాడిని ఇంగ్లాండ్‌కు పంపించే అవకాశాలను బీసీసీఐ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.