Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బారు, ఏఐసిఎఫ్ ప్రతిపాదనలు
న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మక క్రీడా పురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న పురస్కారానికి తెలుగు తేజాలు నామినేట్ అయ్యారు. అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారులు కిదాంబి శ్రీకాంత్, బి. సాయి ప్రణీత్ సహా చదరంగ మాంత్రికురాలు కోనేరు హంపిలు ఈ ఏడాది అత్యున్నత క్రీడా అవార్డు రేసులో నిలిచారు. ప్రపంచ నం.3 ర్యాంక్ కోనేరు హంపి వచ్చే ఏడాది జరుగనున్న మహిళల క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధించింది. ఆన్లైన్ చెస్ ఒలింపియాడ్‌లో విజేతగా నిలిచిన భారత జట్టులో హంపి కీలక సభ్యురాలు. అర్జున అవార్డు, పద్మ శ్రీ పురస్కారాలు అందుకున్న కోనేరు హంపి ఇప్పుడు రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న రేసులో ఉంది. ఏడుగురు చెస్ క్రీడాకారులు విదిత్ ఎస్ గుజరాతి, బి ఆదిబన్, ఎస్పీ సేతురామన్, ఎంఆర్ లలిత్ బాబు, భక్తి కులకర్ణి, పద్మణి రౌత్‌లు అర్జున అవార్డులకు ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ ప్రతిపాదించింది. స్టార్ షట్లర్లు కిదాంబి శ్రీకాంత్, సాయి ప్రణీత్‌లను ఖేల్ రత్నకు సిఫారసు చేసిన భారత బ్యాడ్మింటన్ సంఘం (బారు)... హెచ్.ఎస్ ప్రణరు, ప్రణవ్ జెర్రీ చొర్రపా, సమీర్ వర్మలను అర్జున అవార్డులకు ప్రతిపాదించింది.