Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : డోపింగ్‌లో పట్టుబడిన భారత రెజ్లర్ సుమిత్ మాలిక్‌పై రెండేండ్ల వేటు పడింది. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యుడబ్ల్యూడబ్ల్యూ) ఈ మేరకు శుక్రవారం ప్రకటించింది. నిషేధిత ఉత్పేరకం వాడినట్టు బి శాంపిల్‌లోనూ తేలటంతో రెండేండ్ల నిషేధం విధించారు. 28 ఏండ్ల సుమిత్ మాలిక్ ఈ నిర్ణయాన్ని సవాల్ చేసేందుకు వారం రోజుల గడువు ఉంది. 125కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో టోక్యో ఒలింపిక్స్‌లో మెరుస్తాడనుకున్న సుమిత్ మాలిక్.. వాడా నిషేధిత ఉత్పేరకం ఎంహెచ్ఏను తీసుకున్నట్టు పరీల్లో తేలింది. గత నెల బల్గేరియాలో జరిగిన ప్రపంచ ఒలింపిక్ క్వాలిఫయర్స్ (సోఫియా)లో సుమిత్ మాలిక్ రక్త నమునాలను వాడా తీసుకుంది. రియో ఒలింపిక్స్‌కు ముందు నర్సింగ్ యాదవ్ డోప్ టెస్టులో పట్టుబడగా.. టోక్యోకు ముందు సుమిత్ మాలిక్ చిక్కటం గమన్హాం.