Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2022 కామన్వెల్త్ క్రీడలపై కీలక నిర్ణయం
న్యూఢిల్లీ : 2022 కామన్వెల్త్ క్రీడల నుంచి ఆర్చరీ, షూటింగ్ చాంపియన్షిప్స్లను తొలగించారు. కోవిడ్-19తో నెలకొన్న అనిశ్చితి కారణంగా చంఢగీడ్లో జరగాల్సిన ఈ రెండు ఈవెంట్లను రద్దు చేస్తున్నట్టు కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ ఎగ్జిక్యూటివ్ బోర్డు శుక్రవారం తెలిపింది. '2022 కామన్వెల్త్ క్రీడలకు ఆర్చరీ, షూటింగ్లను రద్దు చేయటం నిరాశ కలిగించే పరిణామం. ప్రస్తుత పరిస్థితుల్లో ఇదే సరైన నిర్ణయమని భావించాం' అని సీజీఎఫ్ అధ్యక్షుడు మార్టిన్ తెలిపారు. 2022 కామన్వెల్త్ క్రీడలకు బర్మింగ్హామ్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఆర్చరీ, షూటింగ్లను క్రీడల నుంచి తొలగిస్తూ ఆరంభంలోనే నిర్వాహక కమిటీ నిర్ణయం తీసుకోగా.. భారత ఒలింపిక్ సంఘం ఒత్తిడితో ఆ రెండు ఈవెంట్లను చంఢగీడ్లో నిర్వహించేందుకు సీఐఎఫ్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.