Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్, ఇంగ్లాండ్ మూడో వన్డే నేడు
వర్సెస్టర్ : చివరి ఏడు వన్డేల్లో ఆరు మ్యాచుల్లో పరాజయం చవిచూసిన భారత మహిళలు.. ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌ను వైట్‌వాష్ చేసుకునే ప్రమాదంలో పడింది. తొలి రెండు వన్డేల్లో భారత్ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాలను ఇంగ్లాండ్ ఆడుతూ పాడుతూ ఛేదించింది. నామమాత్రపు మూడో వన్డేలోనూ మెరిసి, వన్డే సిరీస్ క్లీన్‌స్వీప్‌పై ఇంగ్లాండ్ కన్నేసింది. వైస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ వైఫల్యం భారత ప్రదర్శనను ప్రభావితం చేస్తుంది. కొంత కాలంగా హర్మన్ ఫామ్‌లో లేదు. మ్యాచ్‌ను ప్రత్యర్థి నుంచి లాగేసుకునే ప్రదర్శనలు చేయగల హర్మన్‌ప్రీత్ టీ20 సిరీస్‌కు ముందైనా.. మెరిస్తే భారత జట్టుకు అదే సంతోషం. కెప్టెన్ మిథాలీరాజ్, యువ ఓపెనర్ షెఫాలీ వర్మలకు స్మృతీ మంధాన, హర్మన్ తోడు కావాలి. భారత్, ఇంగ్లాండ్ మహిళల మూడో వన్డే నేడు మధ్యాహ్నాం 3.30 గంటలకు సోనీనెట్వర్క్లో ప్రసారం కానుంది.