Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈసీబీకి బీసీసీఐ అధికారిక వినతి
ముంబయి : ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్కు ముందు భారత జట్టు ఓ టూర్ మ్యాచ్లో ఆడే అవకాశం మెరుగుపడుతోంది. వాస్తవ షెడ్యూల్లో భారత జట్టు అంతర్గత వార్మప్ మ్యాచులు ఆడాల్సి ఉంది. ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ అనుభవంతో టూర్ గేములు కావాలని కెప్టెన్ విరాట్ కోహ్లి కోరాడు. దీంతో ఈసీబీని భారత క్రికెట్ బోర్డు ఈ మేరకు అభ్యర్థించింది. కౌంటీ జట్టుతో మూడు రోజుల వార్మప్ మ్యాచ్కు ఏర్పాట్లు చేయాల్సిందిగా విన్నవించింది. జులై 20-23న టూర్ మ్యాచ్ షెడ్యూల్ చేసేందుకు అవకాశం ఉంది. ' మూడు రోజుల వార్మప్పై బీసీసీఐ చేసిన విజ్ఞప్తిని పరిశీలిస్తున్నాం. కోవిడ్-19 నిబంధనలను దృష్టిలో ఉంచుకుని టూర్ గేమ్ నిర్వహణ సాధ్యాసాధ్యాలపై పనిచేస్తున్నామని' ఈసీబీ అధికార ప్రతినిధి తెలిపారు.