Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 25 ఏండ్ల యువపారా అథ్లెట్‌కు అవకాశం
న్యూఢిల్లీ : భారత స్టార్ పారా జంపర్, పారాలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ మారియప్పన్ తంగవేలుకు అరుదైన గౌరవం లభించింది. దిగ్గజ పారా అథ్లెట్ దేవేంద్ర జజారియా సైతం ఉన్న పారాలింపిక్ అథ్లెట్ల బృందానికి నాయకత్వం వహించే గొప్ప అవకాశం మారియప్పన్‌ను వరించింది. టోక్యో పారాలింపిక్స్ ఆరంభ వేడుకల్లో మారియప్పన్ తంగవేలు భారత పారా అథ్లెట్ల బృందం పతాకాధారిగా నిలువనున్నాడు. 'టోక్యో పారాలింపిక్స్‌లో పతాకధారిగా ఎంపిక కావటం ఎంతో సంతోషం. 1.86 మీటర్ల జంప్‌తో టోక్యోకు అర్హత సాధించాను. అక్కడ ప్రపంచ రికార్డుతో స్వర్ణం సాధిస్తాననే విశ్వాసం ఉంది' అని మారియప్పన్ తెలిపాడు. టోక్యో పారాలింపిక్స్ కోసం మారియప్పన్ బెంగళూర్ సారు సెంటర్లో కఠోరంగా సాధన చేస్తున్నాడు.