Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డోపింగ్‌లో పట్టుబడిన యుఎస్ స్టార్ స్ప్రింటర్
కాలిఫోర్నియా : 10.86 సెకండ్లలో వంద మీటర్ల పరుగు పూర్తి చేసింది. టోక్యో ఒలింపిక్స్ మహిళల 100 మీటర్ల రేసు ఆమేదేనని అంచనాలు. అమెరికా ట్రాక్ అండ్ ఫీల్డ్ ఒలింపిక్ ట్రయల్స్ అనంతరం స్టార్ స్ప్రింటర్ షకేరి రిచర్డ్సన్ గురించే అంతటా చర్చ. మహిళల వంద మీటర్ల పరుగు రాణిగా అప్పుడే అభిమానులు పిలుచుకోవటం మొదలుపెట్టేశారు. ఇంతలోనే పిడుగుపాటులా డోపింగ్ పరీక్ష ఫలితం వెలువడింది. టోక్యో ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ రేసులో ఉన్న స్టార్ స్ప్రింటర్ గంజాయి తాగి.. డోపింగ్ పరీక్షలో దొరికిపోయింది. దీంతో ఒలింపిక్ ట్రయల్స్‌లో ఆమె సాధించిన రికార్డు 10.86 సెకండ్ల రేసు తుడిచిపెట్టుకుపోవటమే కాదు, టోక్యో ఒలింపిక్స్‌లో పోటీపడే అవకాశం సైతం దూరమైంది. ఒలింపిక్స్ ట్రయల్స్‌లో నాలుగో స్థానంలో నిలిచిన జెన్నా ప్రందిని టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించనుంది. ' నేను మనిషినే. అందరికంటే కాస్త వేగంగా పరుగెడతాను' అని షకేరి రిచర్డ్సన్ డోపీగా తేలిన అనంతరం ట్వీట్ చేసింది. గంజాయి నిషేధిత జాబితాలో ఉండటంపై అమెరికాలో భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నా.. షకేరి రిచర్డ్సన్పై నాలుగేండ్ల నిషేధం పడే ప్రమాదం ఉంది. గంజాయి తాగటంతో పరుగు పందెంలో ఎటువంటి అనుచిత అనుకూలత లేదనే విషయం నిరూపించుకుంటే మూడు నెలల నిషేధంతో బయటపడవచ్చు.