Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అయినా.. తక్షణమే ఆడేందుకు లైన్ క్లియర్
లండన్ : 2012, 2014 సమయంలో సోషల్ మీడియా వేదికగా జాతి వివక్ష, లైంగిక వేధింపులకు సంబంధించి వివాదాస్పద ట్వీట్లు చేసిన ఇంగ్లాండ్ క్రికెటర్ ఒలీ రాబిన్సన్పై 8 మ్యాచుల నిషేధం విధించారు. ఒలీ రాబిన్సన్ వివాదంపై విచారణ జరిపిన ముగ్గురు సభ్యుల కమిటీ ఈ మేరకు నిర్ణయాన్ని వెలువరించింది. 8 మ్యాచుల నిషేధం పడినా.. ఒలీ రాబిన్సన్ తక్షణమే అంతర్జాతీయ క్రికెట్ ఆడే వెలుసుబాటు సైతం కల్పించారు. 8 మ్యాచుల్లో.. ఐదింటిని రానున్న రెండేండ్లలో అమలు చేయనుండగా.. మూడు మ్యాచులకు తక్షణమే నిషేధించారు. న్యూజిలాండ్‌తో రెండో టెస్టు సహా కౌంటీ జట్టుతో రెండు మ్యాచులను పరిగణనలోకి తీసుకుంటే మూడు మ్యాచుల తక్షణ నిషేధం ముగిసిపోయింది. దీంతో రానున్న ఇంగ్లాండ్, భారత్ టెస్టు సిరీస్‌లోకి ఒలీ రాబిన్సన్ నేరుగా రానున్నాడు. విచారణ కమిటీ తీర్పును రాబిన్సన్ అంగీకరించగా.. 8 మ్యాచుల నిషేధానికి తోడు రూ.3,29,610 (3200 పౌండ్లు) జరిమానా విధించారు. న్యూజిలాండ్‌తో లార్డ్స్ టెస్టులో అరంగేట్రం చేసిన ఒలీ రాబిన్సన్ అద్భుత ప్రదర్శన చేశాడు. ఆ టెస్టు తొలి రోజు నుంచే ఒలీ రాబిన్సన్ గత ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
టోక్యో ఒలింపిక్స్ అథ్లెట్లలో ఉత్సాహం నింపేందుకు, అథ్లెట్లకు అండగా ఉంటున్నామనే సందేశం పంపేందుకు ఉద్దేశించిన ఒలింపిక్ సెల్ఫీ పాయింట్‌ను (ఐ ఛీర్ ఫర్ ఇండియా) జాతీయ హ్యాండ్‌బాల్ సమాఖ్య అధ్యక్షుడు జగన్మోహన్ రావు గచ్చిబౌలి స్టేడియంలో శనివారం ఆవిష్కరించారు.