Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్
నవతెలంగాణ, హైదరాబాద్
కరోనా మహమ్మారి అన్ని రంగాలను కుదిపేసింది. ఒలింపిక్ ఏడాదిలో క్రీడా రంగం మరింత అధిక కుదుపునకు లోనైంది. భారత అథ్లెట్లతో పాటు ప్రపంచ అథ్లెట్లు సైతం అనిశ్చితి వాతావరణంలోనే సాధన చేయాల్సిన దుస్థితి కరోనా తీసుకొచ్చింది. ఎట్టకేలకు టోక్యో ఒలింపిక్స్ పట్టాలెక్కుతున్నా.. బయో సెక్యూర్ బబుల్ వాతావరణం క్రీడాకారుల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. బయో బబుల్ ఓ రకంగా క్రీడాకారులకు మేలు చేసేదేనని జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నారు. ' బయో సెక్యూర్ బబుల్ భిన్న క్రీడాకారులపై భిన్నంగా ప్రభావం చూపనుంది. నిజానికి, బయో బబుల్‌లో ఉండటం మూలంగా క్రీడాకారులు తమ దృష్టిని కేవలం లక్ష్యంపైనే కేంద్రకరించే అవకాశం లభించనుంది. బయో బబుల్‌తో ఇది అది పెద్ద ప్రయోజనం కానుంది' అని గోపీచంద్ అభిప్రాయపడ్డారు. ఫిక్కి ఎఫ్ఎల్ఓ (లేడీస్ ఆర్గనైజేషన్) 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన సదస్సుకు హాజరైన గోపీచంద్ మీడియాతో మాట్లాడారు. జులై 17న భారత ఒలింపిక్ అథ్లెట్ల బృందం టోక్యోకు బయల్దేరనుందని గోపీచంద్ వెల్లడించారు.