Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రీ క్వార్టర్స్‌లో జర్మనీ భామ
- కోకో గాఫ్ అలవోక విజయం
- వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్
లండన్ : మాజీ ప్రపంచ నం.1, మూడు గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల విజేత ఎంజెలికా కెర్బర్ (జర్మనీ) మహిళల సింగిల్స్ ప్రీ క్వార్టర్స్‌లో కాలుమోపింది. ఇటీవల వరుస టోర్నీల్లో నిరాశపరుస్తున్న కెర్బర్ సెంటర్ కోర్టులో కొత్తగా చెలరేగుతోంది. బెలారస్ భామ అలిసండ్రా సనోవిచ్పై కెర్బర్ 2-6, 6-0, 6-1తో మూడు సెట్ల మ్యాచ్‌లో విజయం సాధించింది. ఐదు ఏస్‌లు సంధించిన కెర్బర్ తొలి సెట్‌ను 2-6తో సులువుగా చేజార్చుకుంది. 0-1 సెట్ వెనుకంజలో నిలిచిన కెర్బర్.. ఒత్తిడిలో పొరపాట్లకు చోటివ్వలేదు. ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదు సార్లు బ్రేక్ చేసిన కెర్బెర్ వరుసగా 6-0, 6-1తో చెలరేగింది. చివరి రెండు సెట్లలో బెలారస్ అమ్మాయికి కేవలం ఒకే ఒక్క గేమ్ పాయింట్ లభించింది. సొంత సర్వీస్‌లో 9 గేమ్‌లు గెల్చుకున్న కెర్బర్.. 72-49 పాయింట్లతో దీటైన విజయంతో ప్రీ క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించింది. అమెరికా యువ సంచలనం కోకో గాఫ్ సైతం ప్రీ క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో గాఫ్ 6-3, 6-3తో అలవోక విజయం నమోదు చేసింది. ఐదు ఏస్‌లు కొట్టిన గాఫ్.. నాలుగు డబుల్ ఫాల్ట్ప్కు పాల్పడింది. స్లోవేనియా క్రీడాకారిణి కాజా జువాన్ రెండు బ్రేక్ పాయింట్లతో గట్టి పోటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. కానీ ఐదుసార్లు కాజా సర్వీస్‌ను బ్రేక్ చేసిన గాఫ్ మ్యాచ్‌పై పట్టు విడువలేదు. 63-45 పాయింట్లతో గాఫ్ స్పష్టమైన ఆధిపత్యం చెలాయించింది. లాటివా సంచలనం జెలెనా ఒస్టాపెంకోకు భంగపాటు తప్పలేదు. ఆస్ట్రేలియా అమ్మాయి అజ్లా చేతిలో 6-4, 4-6, 2-6తో జెలెనా ఒస్టాపెంకో పరాజయం పాలైంది. ఐదు సార్లు బ్రేక్ పాయింట్లు సాధించిన ఒస్టాపెంకో..ఏడు సార్లు సర్వీస్‌ను చేజార్చుకుని మూల్యం చెల్లించుకుంది. చెక్ రిపబ్లిక్ పోరులో కరొలినా ముచోవా 7-5, 6-3తో అనస్థాసియ పవ్లీచెంకోవా పరాజయం పొందింది. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లోకి ప్రవేశించి తనదైన ముద్ర వేసిన పవ్లీచెంకోవా.. వింబుల్డన్‌లో ప్రీ క్వార్టర్స్‌కు ముందే ఇంటిముఖం పట్టింది.
పురుషుల సింగిల్స్‌లో ఇటలీ ఆటగాడు మాట్టో బెరాటిని ప్రీ క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. మూడో రౌండ్ మ్యాచ్‌లో స్లోవేనియా ఆటగాడు అల్జాజ్ బెడెనెపై 6-4, 6-4, 6-4తో మూడు సెట్లలోనే గెలుపొందాడు. 20 ఏస్‌లు కొట్టిన బెరాటిని.. మూడు బ్రేక్ పాయింట్లు సాధించాడు. సొంత సర్వీస్‌లో 15 గేములు గెల్చుకున్న బెరాటిని ప్రత్యర్థిపై పైచేయి సాధించాడు. అలెగ్జాండర్ బబ్లిక్‌పై 6-3, 6-4, 6-2తో హబర్ట్ వరుస సెట్లలో విజయం సాధించాడు.