Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐపీఎల్ 2022 రోడ్‌మ్యాప్ సిద్ధం
- ఆగస్టులో టెండరు ప్రక్రియ ఆరంభం
- అక్టోబర్‌లో కొత్త ప్రాంఛైజీల ప్రకటన
న్యూఢిల్లీ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) బ్లూప్రింట్‌ను బీసీసీఐ సిద్ధం చేసింది. రెండు నూతన ప్రాంఛైజీలు, ఆటగాళ్లను అట్టిపెట్టుకునే విధానం, మెగా వేలం, వేతన పర్సు పెంపుదల, మీడియా హక్కుల టెండరు ఇలా.. కీలక అంశాలపై బీసీసీఐ పక్కా రోడ్‌మ్యాప్‌ను తయారు చేసింది. వచ్చే సీజన్ నుంచి పది జట్ల ఐపీఎల్‌కు బీసీసీఐ ఏజీఎం ఆమోద ముద్ర వేసింది. అందుకోసం ఆగస్టు రెండో వారంలో టెండరు ప్రక్రియ ఆరంభం కానుంది. అక్టోబర్ ఆఖరు నాటికి కొత్త ప్రాంఛైజీలను ప్రకటించనున్నారు. ఈ ఏడాది డిసెంబర్లోనే మెగా ఆటగాళ్ల వేలం నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది జనవరిలో మీడియా హక్కులకు నూతన టెండర్లు ఆహ్వానించనున్నారు. ఆర్పీ సంజీవ్ గోయెంకా గ్రూప్, ఆదాని గ్రూప్, అరబిందో ఫార్మా లిమిటెడ్, టోరెంటో గ్రూప్ సహా కార్పోరేట్ కంపెనీలు ఐపీఎల్ ప్రాంఛైజీల రేసులో ఉన్నాయి.
క్రికెటర్ల వేతనాల పర్సు రూ.85 కోట్ల నుంచి రూ.90 కోట్లకు పెంచనున్నారు. ఇందులో కనీసం 75 శాతం ప్రాంఛైజీలు కచ్చితంగా ఖర్చు చేయాలి. రానున్న మూడేండ్లలో ఈ పర్సు రూ.100 కోట్లను పెంచనున్నారు. మెగా వేలానికి ముందు ఆటగాళ్లను అట్టిపెట్టుకునే విధానం సైతం రెఢ చేశారు. ముగ్గురు స్వదేశీ, ఓ విదేశీ.. ఇద్దరు స్వదేశీ, ఇద్దరు విదేశీ క్రికెటర్లను ప్రాంఛైజీలు అట్టిపెట్టుకునే స్వేచ్ఛ కల్పించనున్నారు. రైట్ టు రిటెయిన్ కార్డును ఈ వేలంలో తొలిగించే అవకాశం కనిపిస్తోంది. అట్టిపెట్టుకునే ఆటగాళ్ల ధరను రూ.15 కోట్లు, రూ.11 కోట్లు, రూ. 7 కోట్లు (ముగ్గురిని నిలుపుకుంటే).. రూ.12.5 కోట్లు, రూ.8.5 కోట్లు (ఇద్దరిని నిలుపుకుంటే), రూ.12.5 కోట్లు (ఒక్కరిని అట్టిపెట్టుకుంటే)గా నిర్దారించారు. కరోనా కాలంలో ఓటీటీ వేదిక వేగంగా పుంజుకుంది. దీంతో పది జట్ల ఐపీఎల్‌కు బీసీసీఐ భారీ ధరను అంచనా వేస్తోంది. ఈ వివరాలపై బీసీసీఐ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.