Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పృథ్వీ, పడిక్కల్ ఎంపికకు విముఖత
ముంబయి :శుభ్‌మన్ గిల్ గాయంతో ఇంగ్లాండ్ సిరీస్‌కు దూరమయ్యాడు. శ్రీలంక పర్యటనలో ఉన్న యువ ఆటగాళ్లు పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్‌ను తక్షణమే ఇంగ్లాండ్‌కు పంపించాలని భారత జట్టు మేనేజ్మెంట్ కోరింది. కోహ్లిసేన కోరినట్టు సీనియర్ సెలక్షన్ కమిటీ నడుచుకునే పరిస్థితి లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. గిల్ దూరమైనా.. రోహిత్ శర్మతో జట్టు కట్టేందుకు మయాంక్ అగర్వాల్, కెఎల్ రాహుల్, అభిమన్యు ఈశ్వరన్ రూపంలో భారత్‌కు ఇంకా ముగ్గురు ఓపెనర్లు అందుబాటులో ఉన్నారు.అనుభవంలేని ఈశ్వరన్‌ను పక్కనపెట్టినా ముగ్గురు ఓపెనర్లు అందుబాటులో ఉన్నారు. అందుకే పృథ్వీ, పడిక్కల్‌ను సీనియర్ సెలక్షన్ కమిటీ ఇంగ్లాండ్‌కు పంపించే ఆలోచనలో లేనట్టు తెలుస్తోంది. జట్టు మేనేజ్మెంట్ ఈ అంశంపై బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షాలకు అధికారిక విజ్ఞప్తి చేస్తేనే సీనియర్ సెలక్షన్ కమిటీ రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయని సంబంధిత వర్గాల సమాచారం.