Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐసీసీ ఈవెంట్లపై17 దేశాల ఆసక్తి
దుబారు : 2024-2031 ఐసీసీ ఈవెంట్లపై అన్ని దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. 2023 వన్డే వరల్డ్‌కప్‌తో ప్రస్తుత ఎఫ్టీపీ పూర్తి కానుంది. రానున్న ఎఫ్టీపీలో రెండు వన్డే ప్రపంచకప్‌లు, నాలుగు టీ20 ప్రపంచకప్‌లు, రెండు చాంపియన్స్ ట్రోఫీలు ఉన్నాయి. ఎనిమిది మెగా ఈవెంట్ల నిర్వహణకు ఏకంగా 17 దేశాలు రేసులో ఉన్నాయి. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, ఐర్లాండ్, జింబాబ్వే సహా అసోసియేట్ దేశాలు మలేషియా, నమీబియా, ఓమన్, స్కాట్లాండ్, యుఏఈ, యుఎస్ఏలు సాంకేతిక ప్రతిపాదనలు పంపాయి. 1996 వరల్డ్‌కప్ ఫైనల్ అనంతరం మరో ఐసీసీ ఈవెంట్‌కు ఆతిథ్యం ఇవ్వని పాకిస్థాన్ సైతం రేసులో నిలిచింది. 2011 ప్రపంచకప్‌కు సహ ఆతిథ్య దేశంగా నిలవాల్సి ఉన్నప్పటికీ భద్రత కారణాల రీత్యా వీలు పడలేదు. గతంలో ఐసీసీ ఈవెంట్లను ఓపెన్ బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా నిర్ణయించేవారు. ఐసీసీ బోర్డు ఆతిథ్య దేశాలను ఎంచుకునే అధికారం కలిగి ఉండటంతో.. మళ్లీ పెద్ద క్రికెట్ బోర్డులకే ఆతిథ్య హక్కులు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.