Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టాప్ సీడ్ల ఎదురులేని విజయాలు
- ఇగా స్వైటెక్‌కు జెబ్యూర్ షాక్
- వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్
నవతెలంగాణ-లండన్
వింబుల్డన్‌లో టాప్ సీడ్లకు ఎదురు లేదు!. పురుషుల సింగిల్స్‌లో వరల్డ్ నం.1 నొవాక్ జకోవిచ్, మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నం.1 ఆష్లె బార్టీలు అలవోక విజయాలతో క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు. ఆస్ట్రేలియా స్టార్ ఆష్లె బార్టీ 7-5, 6-3తో వరుస సెట్లలో విజయం సాధించింది. ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ బార్బరా క్రజికోవా (చెక్ రిపబ్లిక్)పై బార్టీ గంటన్నర మ్యాచ్‌లో గెలుపొందింది. తొలి సెట్‌ను టైబ్రేకర్‌లో గెల్చుకున్న బార్టీ.. ఏడు ఏస్‌లు కొట్టింది. నాలుగు సార్లు క్రజికోవా సర్వీస్‌ను బ్రేక్ చేసింది. 22 విన్నర్లు కొట్టింది. 24 అనవసర తప్పిదాలకు పాల్పడినా.. క్రజికోవా సొమ్ముచేసుకోలేదు. 81-68తో పాయింట్ల పరంగా స్పష్టమైన ఆధిపత్యం చూపించింది. పురుషుల సింగిల్స్‌లో సెర్బియా స్టార్‌కు ప్రతిఘటన ఎదురుకాలేదు. 17వ సీడ్, క్రిస్టియన్ గారిన్ (చిలీ)పై వరుస సెట్లలో విజయం సాధించాడు. 6-2, 6-4, 6-2తో చెమట చిందించకుండా క్వార్టర్స్‌లో కాలుమోపాడు. 9 ఏస్‌లు కొట్టిన జకోవిచ్, ఐదు బ్రేక్ పాయింట్లు సాధించాడు. జకోవిచ్ 28 విన్నర్లు కొట్టగా.. గారిన్ 14 విన్నర్లే కొట్టాడు. జకోవిచ్ 95 పాయింట్లు సాధించగా, గారిన్ 57 పాయింట్లు మాత్రమే గెల్చుకున్నాడు. జకోవిచ్ 23 అనవసర తప్పిదాలకు పాల్పడగా.. గారిన్ 26 అనవసర తప్పిదాలు చేశాడు.
పురుషుల సింగిల్స్‌లో ఐదో సీడ్ ఆండ్రీ రూబ్లెవ్ (రష్యా)కు చుక్కెదురు. హంగరీ ఆటగాడు మార్టన్ ఐదు సెట్ల పోరులో రూబ్లెవ్ను ఓడించాడు. 6-3, 4-6, 4-6, 6-0, 6-3తో మార్టన్ గెలుపొందాడు. ఏడుసార్లు రూబ్లెవ్ను బ్రేక్ చేసిన మార్టన్ క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. ఏడో సీడ్ మాట్టో బెరాటిని 6-4, 6-3, 6-1తో ఇవష్కపై విజయం సాధించాడు. చెక్ ఆటగాడు కారెన్ 3-6, 6-4, 6-3, 5-7, 10-8తో సెబాస్టియన్ (అమెరికా)ను ఓడించాడు. డెనిస్ సపలోవ్ 6-1, 6-3, 7-5తో ఎనిమిదో సీడ్ రాబర్టో బటిస్టా ఆగట్ (స్పెయిన్)కు చెక్ పెట్టాడు. మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్ సబలెంకా (బెలారస్) మూడు సెట్ల మ్యాచ్‌లో చెమటోడ్చింది. ఎలెనా రెబకినా (కజకిస్తాన్)పై 6-3, 4-6, 6-3తో విజయం సాధించింది. ఏడో సీడ్ పొలాండ్ భామ ఇగా స్వైటెక్‌కు భంగపాటు. ప్రీ క్వార్టర్స్‌లో ట్యూనిషియా అమ్మాయి ఓన్స్ జెబ్యూర్ చేతిలో 7-5, 1-6, 1-6తో చిత్తుగా ఓడింది. ఏడు సార్లు సర్వీస్ కోల్పోయిన స్వైటెక్ వింబుల్డన్ నుంచి నిష్క్రమించింది. చెక్ భామ కరొలినా ముచోవా 7-6(8-6), 6-4తో పౌలా బడోసాపై గెలుపొంది క్వార్టర్స్‌కు చేరుకుంది. అమెరికా స్టార్ మడిసన్ కీస్ 6-7(3-7), 3-6తో స్విస్ అమ్మాయి విక్టోరియా గోలుబిక్ చేతిలో ఓటమి చెందింది.