Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రీ క్వార్టర్స్‌లో రెండో సీడ్‌కు ఓటమి
- సెమీస్‌లో అడుగుపెట్టిన ప్లిస్కోవా
- వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ 2021
నవతెలంగాణ-లండన్ : వరల్డ్ నం.2, రష్యా స్టార్ క్రీడాకారుడు డానిల్ మెద్వ దేవ్‌కు గట్టి షాక్. క్వార్టర్‌ఫైనల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన రెండో సీడ్ రష్యన్‌కు పొలాండ్ కుర్రాడు చెక్ పెట్టాడు. వర్షం కారణంగా సోమవారం నిలిచి పోయిన ప్రీ క్వార్టర్స్ మ్యాచ్.. మంగళవారం పున ప్రారంభం కాగా రష్యన్ స్టార్‌కు భంగ పాటు తప్పలేదు. 182 నిమిషాల మ్యాచ్‌లో 14వ సీడ్ పొలాండ్ ఆటగాడు హుబర్ట్ హుర్కాజ్ విజయం సాధిం చాడు. 6-2, 6-7(2-7), 6-3, 3-6, 3-6తో మెద్వదేవ్ పరాజయం పాల య్యాడు. మెద్వదేవ్‌కు దీటుగా ఆడిన హుబర్ట్ కీలక టైబ్రేకర్‌ను దారితీసిన సెట్‌ను సొంతం చేసుకుని మ్యాచ్‌పై పట్టు సాధించాడు. హుబర్ట్ హుర్కాజ్‌కు వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్‌లో ఇదే తొలి క్వార్టర్‌ఫైనల్. నేడు జరిగే క్వార్టర్స్ పోరులో స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌తో హుబర్ట్ తలపడనున్నాడు. మెద్వదేవ్ 13 ఏస్‌లు కొట్టగా, హుబర్ట్ 10 ఏస్‌లు సంధించాడు. మెద్వదేవ్ 45 విన్నర్లు సాధించగా, హుబర్ట్ 47 విన్నర్లతో మెరిశాడు. మెద్వదేవ్, హుబర్ట్ చెరో మూడు బ్రేక్ పాయింట్లు గెల్చుకున్నారు. హుబర్ట్ 38 అనవసర తప్పిదాలకు పాల్పడగా.. మెద్వదేవ్ 33 అనవసర తప్పిదాలు చేశాడు. పాయింట్ల పరంగానూ 150-145తో మెద్వదేవ్ పైచేయి సాధించాడు. కానీ నాలుగు సెట్లలో ఐదు సెట్లలో మూడింటిని కైవసం చేసుకున్న హుబర్ట్ క్వార్టర్‌ఫైనల్స్ బెర్త్ ఖాయం చేసుకున్నాడు. ఇదిలా ఉండగా పురుషుల సింగిల్స్‌లో నేడు క్వార్టర్‌ఫైనల్స్‌లో జకోవిచ్, మార్టన్లు.. కచకోవ్, డెనిస్ సపలోవ్లు, బెరాట్టిని, ఫెలిక్స్‌లు సెమీస్ బెర్త్ కోసం పోటీపడనున్నారు.
మహిళల సింగిల్స్ విభాగంలో 8వ సీడ్, చెక్ రిపబ్లిక్ భామ కరొలినా ప్లిస్కోవా సెమీఫైనల్లోకి ప్రవేశించింది. మంగళవారం సెంటర్‌కోర్టులో జరిగిన క్వార్టర్ఫైనల్లో స్విట్జర్లాండ్ అమ్మాయి విక్టోరియా గొలుబిక్పై ప్లిస్కోవా వరుస సెట్లలో విజయం సాధించింది. 6-2, 6-2తో ప్లిస్కోవా అలవోకగా సెమీస్‌కు చేరుకుంది. 8 ఏస్‌లు కొట్టిన ప్లిస్కోవా.. నాలుగు బ్రేక్ పాయింట్లు సాధించింది. 71-45తో పాయింట్ల పరంగానూ తిరుగులేని ఆధిపత్యం చూపించింది. ప్రీ క్వార్టర్స్‌కు చేరుకుని అందరి దృష్టిని ఆకర్షించిన బ్రిటన్ యువ క్రీడాకారిణి ఎమ్మా రెడాకను ఆరోగ్య సమస్యతో ప్రీ క్వార్టర్స్ మ్యాచ్ నుంచి తప్పుకుంది. 4-6, 0-3తో ఉన్న దశలో అజ్లా (ఆస్ట్రేలియా)కు క్వార్టర్స్ బెర్త్‌ను కోల్పోయింది.