Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్‌లేపిన హైదరాబాదీ
దుబారు : భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్, దిగ్గజ బ్యాటర్ మిథాలీరాజ్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకుంది. ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌లో హ్యాట్రిక్ అర్థ సెంచరీలు నమోదు చేసిన మిథాలీరాజ్ బ్యాటర్ల జాబితాలో వరల్డ్ నం.1గా నిలిచింది. 39 ఏండ్ల మిథాలీరాజ్ తొలిసారి 2005లో ఐసీసీ వరల్డ్ నం.1 బ్యాటర్‌గా నిలిచింది. అగ్రస్థానంలో నిలిచిన తొలి సందర్భానికి ఇప్పటికి 16 ఏండ్ల వ్యత్యాసం. మహిళల క్రికెట్లో ఇంత వ్యత్యాసంతో ఏ బ్యాటర్‌గా అగ్రస్థానంలో నిలువలేదు. మూడో వన్డేలో అజేయ అర్థ సెంచరీతో భారత్‌కు విజయాన్ని అందించటంతో పాటు అంతర్జాతీయ మహిళల క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఇంగ్లాండ్ లెజెండ్ ఎడ్వర్డ్స్‌ను మిథాలీరాజ్ దాటేసిన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ సిరీస్‌ను వరల్డ్ నం.7గా ఆరంభించిన మిథాలీ.. తొలి వన్డేతోనే టాప్-5లోకి వచ్చేసింది. వన్డే సిరీస్‌లో 206 పరుగులు చేసి ఇప్పుడు ప్రపంచ అగ్ర బ్యాటర్ స్థానానికి చేరుకుంది. యువ బ్యాటర్ షెఫాలీ వర్మ 49 స్థానాలు మెరుగై 71వ స్థానంలోకి వచ్చింది. బౌలింగ్ జాబితాలో దీప్తి శర్మ 12వ స్థానంలో ఉండగా.. జులన్ గోస్వామి 53వ స్థానంలో నిలిచింది.