Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వృద్దాప్య సమస్యలతో తుది శ్వాస
కోల్కత : రెండు సార్లు ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్, హాకీ దిగ్గజం కేశవ్ దత్ బుధవారం కన్నుమూశారు. 95 ఏండ్ల వయసులో వృద్దాప్య సమస్యలతో ఇబ్బంది పడిన కేశవ్ దత్ మంగళవారం అర్థరాత్రి 12.30 గంటలకు తన నివాసంలో తుది శ్వాస విడిచారు. భారత హాకీ స్వర్ణ యుగంలో ఓ వెలుగు వెలిగిన కేశవ్ దత్ 1948, 1952 ఒలింపిక్స్లో స్వర్ణం సాధించిన భారత హాకీ జట్టులో కీలక సభ్యుడు. కేశవ్ దత్ మరణం పట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, హాకీ ఫెడరేషన్, క్రీడాకారులు సంతాపం తెలిపారు.