Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మొక్కలు నాటిన సింధు, సాయిప్రణీత్
నవతెలంగాణ, హైదరాబాద్ : టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించే అథ్లెట్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ నగదు బహుమానం ఇవ్వనుందని క్రీడాశాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ పునరుద్ఘాటించారు. ఒలింపిక్ స్వర్ణానికి రూ. 2 కోట్లు, రజతానికి రూ.1 కోటి, కాంస్యానికి రూ.50 లక్షలు ఇవ్వనున్నట్టు మంత్రి తెలిపారు. టోక్యో ఒలింపిక్స్‌లో పోటీపడనున్న అథ్లెట్లు పి.వి సింధు, బి. సాయిప్రణీత్, సాత్విక్‌సాయిరాజ్, చిరాగ్ శెట్టిలు సహా సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్ మీర్జా, బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్‌లను బుధవారం గచ్చిబౌలి స్టేడియంలో మంత్రి సన్మానించారు. గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా పి.వి సింధు, సాయిప్రణీత్‌లు స్టేడియం ఆవరణలో మొక్కలు నాటారు.