Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాత్విక్, చిరాగ్‌లకు కఠినం
- ఒలింపిక్స్ డ్రా విడుదల
హైదరాబాద్ : టోక్యో ఒలింపిక్స్ పసిడి పతకం రేసులో ముందున్న భారత స్టార్ షట్లర్ పి.వి సింధుకు సులువైన డ్రా ఎదురైంది!. 2020 టోక్యో ఒలింపిక్స్ డ్రాలను గురువారం వర్చువల్ కార్యక్రమంలో ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య విడుదల చేసింది. మహిళల సింగిల్స్ గ్రూప్-జెలో చోటుచేసుకున్న పి.వి సింధు.. హాంగ్‌కాంగ్ (చైనీస్ తైపీ), ఇజ్రాయిల్ షట్లర్లతో గ్రూప్ దశలో పోటీపడనుంది. వరల్డ్ నం.34 చెయంగ్ గన్ యితో ముఖాముఖి పోరులో సింధు 5-0, ఇజ్రాయిల్ అమ్మాయి సెనియా పొలికర్పోవాపై 2-0 రికార్డుతో సింధు ఎదురులేని గణాంకాలు నమోదు చేసింది. (డ్రా అంచనా ప్రకారం ఫైనల్స్ వరకు చేరుకుంటే) గ్రూప్ దశ అనంతరం సింధుకు డెన్మార్క్ షట్లర్ మియా బ్లిచ్ఫిట్ ఎదురుకానుంది!. క్వార్టర్ఫైనల్లో అకానె యమగూచి (జపాన్), లేదా కిమ్ గా ఎన్లు తారసపడనున్నారు. సెమీఫైనల్లోనే వరల్డ్ నం.1 తైజు యింగ్ (చైనీస్ తైపీ) సవాల్ ఎదుర్కొవాల్సి ఉంటుంది. స్వర్ణం రేసులో అత్యుత్తమ షట్లర్, చైనా స్టార్ చెన్ యుఫెరుతో సింధు తలపడే అవకాశం ఉంది.
పురుషుల సింగిల్స్‌లో బి. సాయిప్రణీత్ గ్రూప్-డిలో నిలిచాడు. నెదర్లాండ్స్ షట్లర్ మార్క్, ఇజ్రాయిల్ షట్లర్ జిల్బర్మాన్లతో సాయిప్రణీత్ పోటీపడనున్నాడు. పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్సాయిరెడ్డి రాంకీరెడ్డి, చిరాగ్ శెట్టిలకు కఠిన డ్రా ఎదురైంది. టాప్ సీడ్, వరల్డ్ నం.1లు ఉన్న గ్రూప్-ఏలో సాత్విక్, చిరాగ్‌లు ఉన్నారు. వరల్డ్ నం.1 కెవిన్ సంజయ, మార్కస్ (ఇండోనేషియా), ప్రమాదకర తైవాన్ జోడీ లీ యాంగ్, వాంగ్ చి లిన్.. ఇంగ్లాండ్ జోడీ బెన్ లేన్, సీన్ వెండీలు సాత్విక్, చిరాగ్‌లతో కలిసి గ్రూప్-ఏలో ఉన్నారు. వరల్డ్ నం.10 సాత్విక్, చిరాగ్ జోడీ గ్రూప్ దశలో అత్యంత కఠిన ప్రత్యర్థులను ఎదుర్కొనున్నారు.