Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐసోలేషన్‌లో లూథియాన, ఇజ్రాయెల్ జట్లు
టోక్యో (జపాన్) : టోక్యో ఒలింపిక్స్ నిర్వాహకులకు మరో ఎదురుదెబ్బ!. కరోనా మహమ్మారి నేపథ్యంలో కఠిన ఆంక్షలు, చర్యలు తీసుకుంటున్న ఒలింపిక్ నిర్వాహకులు.. అథ్లెట్ల బృందంలోనే కోవిడ్ కేసులు వెలుగు చూస్తుండటంతో ఆందోళనకు గురవుతున్నారు. కోవిడ్‌ను నిలువరించేందుకు సకల ఏర్పాట్లు చేసినా.. విశ్వ క్రీడల ఆరంభానికి రెండు వారాల ముంగిట కేసుల నమోదు ఒకింత ఆందోళనకు కారణమవుతోంది. సెర్బియా, ఉగండా ఒలింపిక్ బృందాల్లో కోవిడ్ కేసులు వెలుగు చూడగా.. తాజాగా ఇజ్రాయెల్, లూథియాన అథ్లెట్లు కోవిడ్-19 బారిన పడ్డారు. ఈ మేరకు 'రాయిటర్స్' వార్త కథనం ప్రచురించింది. ఒలింపిక్స్‌ను దృష్టిలో ఉంచుకుని టోక్యో నగరంలో సోమవారం నుంచి వైరస్ అత్యయిక స్థితిని విధించిన సంగతి తెలిసిందే.
లూథియాన రోయింగ్ జట్టులోని ఓ అథ్లెట్ కోవిడ్ బారిన పడినట్టు తెలుస్తోంది. ఇజ్రాయెల్ శిబిరంలో సైతం అథ్లెట్‌కే కోవిడ్ సోకింది. ఇజ్రాయెల్ కోవిడ్ బాధిత అథ్లెట్‌తో కలిసి ప్రయాణం చేసిన నలుగురు అథ్లెట్లను సైతం ఐసోలేషన్‌లో ఉంచారు. ఇజ్రాయెల్ బృందాన్ని ఐసోలేషన్‌లో ఉంచి పున పరీక్షలు నిర్వహించనున్నారు. 89 మంది జంబో బృందంతో టోక్యోకు వచ్చిన ఇజ్రాయెల్ ఒలింపిక్ చరిత్రలోనే అతి పెద్ద జట్టును క్రీడలను పంపించింది.