Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత్, శ్రీలంక వైట్‌బాల్ సిరీస్ వారం రోజులు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. జులై 6న కొలంబోకు చేరుకున్న శ్రీలంక క్రికెటర్లు ప్రస్తుతం క్వారంటైన్‌లోనే ఉన్నారు. కోవిడ్ కేసుల నమోదుతో జులై 12 నాటికి గానీ ఆటగాళ్లకు నెట్స్ సౌకర్యం లభించదు. ద్వితీయ శ్రేణి జట్టుతో సిరీస్‌ను నడిపించేందుకు ఓ ఆప్షన్ అందుబాటులో ఉన్నప్పటికీ.. ప్రథమ ప్రాధాన్య జట్టుతోనే సిరీస్‌కు వెళ్లేందుకు శ్రీలంక క్రికెట్ బోర్డు ఆలోచన చేస్తోంది. ' జట్టులో క్రికెటర్లు అందరూ నెగెటివ్‌గా వచ్చారు. కానీ బ్యాటింగ్ కోచ్, డేటా అనలిస్ట్ పాజిటివ్‌గా తేలారు. దీంతో భారత్‌తో సిరీస్ రీషెడ్యూల్ చేయాలని భావిస్తున్నామని' శ్రీలంక క్రికెట్ బోర్డు కార్యదర్శి మోహన డిసిల్వ తెలిపారు. బీసీసీఐ, ప్రసారదారులు, స్పాన్సర్లతో సంప్రదింపుల అనంతరం తుది నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తోంది. తొలి వన్డే జులై 17-20న ఆరంభమయ్యేలా రీ షెడ్యూల్ రూపొందించనున్నారు. సిరీస్ నూతన షెడ్యూల్ నేడు ప్రకటించనున్నారని సమాచారం!.