Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జులై 29న చివరి టీ20
-భారత్, శ్రీలంక సిరీస్ రీషెడ్యూల్
నవతెలంగాణ-ముంబయి
భారత్, శ్రీలంక వైట్‌బాల్ సిరీస్ రీషెడ్యూల్ చేశారు. ఇంగ్లాండ్ పర్యటన నుంచి స్వదేశానికి చేరుకున్న శ్రీలంక క్రికెట్ జట్టులో రెండు కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. కోవిడ్ కేసుల కారణంగా శ్రీలంక జట్టు ఐసోలేషన్‌లోనే ఉంది. జులై 13న తొలి వన్డే ఆరంభం కానుండగా.. జట్టు ఐసోలేషన్‌లో ఉండటంతో సిరీస్‌ను రీషెడ్యూల్ చేశారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), ప్రసారదారులు, స్పాన్సర్లతో సంప్రదింపుల అనంతరం శ్రీలంక క్రికెట్ బోర్డు నూతన షెడ్యూల్‌ను విడుదల చేసింది. రీ షెడ్యూల్ ప్రకారం జులై 18న తొలి వన్డే జరుగనుండగా, జులై 29న చివరి టీ20తో శ్రీలంక పర్యటన ముగియనుంది. ' అసాధారణ పరిస్థితులను మేము అర్థం చేసుకున్నాం. కఠిన సమయంలో శ్రీలంక బోర్డుకు పూర్తి సహకారం అందిస్తాం. బీసీసీఐ వైద్య బృందం ఇప్పటికే శ్రీలంక బోర్డుతో కలిసి పనిచేస్తుంది' అని బీసీసీఐ కార్యదర్శి జై షా ఓ ప్రకటనలో తెలిపారు.
మరో పాజిటివ్ కేసు! : భారత్‌తో సిరీస్ కోసం శ్రీలంక సిద్ధం చేసిన రెండు ప్రత్యామ్నాయ గ్రూపుల్లో ఓ కోవిడ్ పాజిటివ్ కేసు నమోదైంది. కొలంబో, దంబుల్లా వేదికల్లో రెండు బృందాలు సిద్ధంగా ఉన్నాయి. కొలంబో శిబిరంలో ఓ ఆటగాడు వైరస్ బారిన పడినట్టు సమాచారం. నూతన షెడ్యూల్ ప్రకారం సిరీస్ సజావుగా సాగేందుకు..అనివార్య పరిస్థితుల్లో ఈ రెండు శిబిరాల నుంచి ద్వితీయ శ్రేణి జట్టును ఎంపిక చేసేందుకు శ్రీలంక బోర్డు సిద్ధంగా ఉంది.
భారత్, శ్రీలంక సిరీస్ షెడ్యూల్
జులై 18 తొలి వన్డే
జులై 20 రెండో వన్డే
జులై 23 మూడో వన్డే
జులై 25 తొలి టీ20
జులై 27 రెండో టీ20
జులై 29 మూడో టీ20
గమనిక : అన్ని మ్యాచులు
కొలంబో వేదికగా జరుగుతాయి