Authorization
Mon Jan 19, 2015 06:51 pm
1- ఫైనల్లో ఇంగ్లాండ్, ఇటలీ ఢ నేడు
- యూరో ఫుట్‌బాల్ కప్
లండన్ : 966 ప్రపంచకప్ విజయం అనంతరం మరోసారి ఓ టోర్నీ ఫైనల్లోకి చేరుకోని.. 2020 యూరో కప్ టైటిల్ పోరుకు రంగం సిద్ధం చేసుకుంది. 55 ఏండ్ల సుదీర్ఘ విరామం అనంతరం ఇంగ్లాండ్ మరోసారి టైటిల్ కోసం బరిలోకి దిగుతోంది. యూరోపియన్ చాంపియన్‌షిప్‌లో అంతిమ సమరంలో ఆడనుండటం ఇంగ్లాండ్‌కు ఇదే తొలిసారి. 1966 వరల్డ్‌కప్ అందుకున్న వెంబ్లే స్టేడియంలోనే.. యూరో ఫైనల్ జరుగనుండటం ఇంగ్లాండ్‌కు మరింత ఉత్సాహం అందిస్తోంది. ఆరు ప్రపంచకప్ ఫైనల్స్, మూడు యూరో కప్ ఫైనల్స్ ఆడిన ఇటలీతో నేడు ఇంగ్లాండ్ టైటిల్ కోసం పోటీపడనుంది. 1968లో యూరో నెగ్గిన ఇటలీ.. 2000, 2012లలో రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు హ్యారీకేన్, ఇటలీ స్టార్ గియోర్జియో చిలినిలు నేడు ఫైనల్లో ప్రధాన ఆకర్షణగా నిలువనుంది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్థరాత్రి 12.30 గంటలకు యూరో కప్ ఫైనల్ ఆరంభం అవనుంది.