Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒలింపిక్ గ్రామంలోకి చెక్ రిపబ్లికన్లు
టోక్యో : 2020 టోక్యో ఒలింపిక్ క్రీడలకు మరో పది రోజులే ఉండగా.. భారత ఒలింపిక్ సెయిలింగ్ బృందం మంగళవారం టోక్యోకు చేరుకుంది. వరుణ్ టక్కర్, కె.సి గణపతి, విష్ణు శరవణన్, నేత్రా కుమాణన్లతో కూడిన సెయిలింగ్ బృందం టోక్యోలో అడుగుపెట్టింది. సోమవారం బయల్దేరని సెయిలర్లు.. మంగళవారం అక్కడికి చేరుకున్నారు. నలుగురు సెయిలర్లు, కోచ్‌ల బృందం మూడు రోజుల క్వారంటైన్లో ఉండనుంది. సెయిలర్ల ఈవెంట్ జులై 25న ఆరంభం కానుండటంతో ముందుగానే అక్కడికి చేరుకున్నారు. మరోవైపు టోక్యో ఒలింపిక్ విలేజ్‌లోకి అడుగుపెట్టిన తొలి జట్టుగా చెక్ రిపబ్లిక్ నిలిచింది. క్వారంటైన్ పూర్తి చేసుకున్న చెక్ రిపబ్లిక్ ఒలింపిక్ గ్రామానికి చేరుకుంది. ఒలింపిక్ గ్రామం ఆవిష్కరణ వేడుకలను నిర్వాహకులు రద్దు చేశారు. ఎటువంటి హంగూ ఆర్బాటం లేకుండానే అథ్లెట్లు గ్రామంలోకి అడుగుపెట్టారు. ఒలింపిక్ విలేజ్‌లోకి అథ్లెట్ల ప్రవేశాన్ని కవర్ చేసేందుకు మీడియా సైతం అనుమతి ఇవ్వలేదు.
జంబో జట్టు : టోక్యో ఒలింపిక్స్‌కు భారత్ 228 మందితో కూడిన బలమైన, భారీ జట్టును పంపిస్తోంది. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడు నరెందర్ బత్రా ఈ మేరకు మంగళవారం అధికారికంగా వెల్లడించాడు. 228 మంది బృందంలో 119 మంది అథ్లెట్లు ఉన్నారు. అందులో 67 మంది పురుషులు, 52 మంది మహిళా అథ్లెట్లు ఉన్నట్టు బత్రా తెలిపారు. 90 మందితో కూడిన భారత బృందం జులై 17న తొలి విడతగా టోక్యోకు బయల్దేరనుంది. అంతకముందే సెయిలర్లు, రోయర్లు (జులై 16) టోక్యోకు చేరుకోనున్నారు.-