Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుండెపోటుతో వరల్డ్‌కప్ హీరో తుది శ్వాస
ముంబయి : భారత మాజీ క్రికెటర్, 1983 ప్రపంచకప్ జట్టులో కీలక సభ్యుడు యశ్పాల్ శర్మ (66) కన్నుమూశారు. గుండెపోటుతో మంగళవారం యశ్పాల్ తుది శ్వాస విడిచారు. 1983 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ మ్యాచ్ విన్నింగ్ 60 పరుగుల ఇన్నింగ్స్ నమోదు చేసిన యశ్పాల్.. 34.28 సగటుతో ఆ వరల్డ్‌కప్‌లో విలువైన 240 పరుగులు చేశాడు. 1979-83 వరకు భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన యశ్పాల్ 37 టెస్టుల్లో 1606 పరుగులు చేశాడు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గా 1979లో ఇంగ్లాండ్‌పై అరంగేట్రం చేసిన యశ్పాల్.. పంజాబ్ స్కూల్స్ తరఫున 260 పరుగుల ఇన్నింగ్స్‌తో వెలుగులోకి వచ్చాడు. 1983 వరల్డ్‌కప్ జట్టులో అత్యంత ఫిట్టెస్ట్ క్రికెటర్ యశ్పాల్ శర్మ..రిటైర్మెంట్ అనంతరం పలు అవతారాల్లో కనిపించాడు. ఉత్తరప్రదేశ్ రంజీ జట్టు కోచ్‌గా, సెలక్షన్ కమిటీ సభ్యుడిగా, అంపైర్‌గా యశ్పాల్ బహుముఖ ప్రజ్ఞ చాటుకున్నాడు. యశ్పాల్ శర్మ మరణం పట్ల భారత క్రికెటర్లు, మాజీ క్రికెటర్లు, 1983 ప్రపంచకప్ సహచర హీరోలు సంతాపం తెలిపారు. సోషల్ మీడియా వేదికగా యశ్పాల్ చిరస్మరణీయ 'బాబ్ విల్స్పై సిక్సర్'ను గుర్తు చేసుకున్నారు.