Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒకే ఇన్నింగ్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన
లండన్ : ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌కు ముందు భారత ట్రంప్‌కార్డ్, ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అదరగొట్టాడు. డ్యూక్ బంతితో మాయజాలం చేయటంలో నైపుణ్యం మెరుగుపర్చుకుంటున్నాడు!. కౌంటీ చాంపియన్‌షిప్‌లో సర్రే తరఫున అరంగేట్రం చేసిన అశ్విన్.. రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల మ్యాజిక్‌తో మెరిశాడు. రెండో ఇన్నింగ్స్‌లో కొత్త బంతితో బౌలింగ్ చేసిన అశ్విన్ 13 ఓవర్లలోనే ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్‌ను కకావికలం చేశాడు. 13 ఓవర్లలో 23 పరుగులు ఇచ్చిన అశ్విన్ ఐదు వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో 42 ఓవర్లలో 1/96 గణాంకాలు నమోదు చేసిన అశ్విన్.. రెండో ఇన్నింగ్స్‌లో మ్యాజిక్ చేశాడు. సోమర్సెట్ బ్యాట్స్‌మెన్ స్టీవెన్ డెవిస్, టామ్ లాన్మోన్బై, జేమ్స్ హిల్డ్రెత్, జార్జ్ బార్లెట్, రొలెఫ్ వాన్ డర్ మెర్వెలను అశ్విన్ అవుట్ చేశాడు. భారత్, ఇంగ్లాండ్ తొలి టెస్టు ఆగస్టు 4 నుంచి ఆరంభం కానుంది. న్యూజిలాండ్‌తో ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ అనంతరం భారత క్రికెటర్లు విహారంలో ఉండగా.. అశ్విన్ కౌంటీ చాంపియన్‌షిప్‌తో విలువైన అనుభవం గడిస్తున్నాడు.