Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంగ్లాండ్, భారత్ సిరీస్‌తో డబ్ల్యూటీసీ2 ఆరంభం
- ప్రతి మ్యాచ్‌కు సమాన పాయింట్లు కేటాయింపు
దుబాయ్ : చారిత్రక తొలి ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచిన భారత జట్టు.. నెలన్నర విరామంలో మరో ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ రేసులో నిలువనుంది. ఆగస్టు 4 నుంచి ఆరంభం కానున్న భారత్, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌తో ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-2 ఆరంభం కానుంది. 2021-23 డబ్ల్యూటీసీ పాయింట్ల పద్దతిని సైతం ఐసీసీ క్రికెట్ కమిటీ ఆమోదం తెలిపింది. గతంలో సిరీస్‌కు 120 పాయింట్లు కేటాయించగా.. తాజాగా ప్రతి మ్యాచ్‌కు పాయింట్లు కేటాయించారు. విజయానికి 12 పాయింట్లు, డ్రాకు నాలుగు పాయింట్లు, టైకి ఆరు పాయింట్లు ఇవ్వనున్నారు.
' పాయింట్ల పద్దతిని సింపుల్‌గా ఉంచాలని సూచనలు అందాయి. క్రికెట్ కమిటీ ఆ సూచనలను పరిగణనలోకి తీసుకుంది. డబ్ల్యూటీసీ-1లో కరోనా ప్రభావంతో అన్ని సిరీస్‌లు పూర్తి కాకపోయినా.. పాయింట్ల శాతంతో విజేతను తేల్చగలిగాం. కొత్త పద్దతిలోనూ ఎన్ని మ్యాచులు ఆడారనే అంశంతో నిమిత్తం లేకుండా ఫలితాన్ని తేల్చడానికి వీలుంది' అని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. డబ్ల్యూటీసీ-1లో తొమ్మిది జట్లు పోటీపడ్డాయి. ఇప్పుడూ తొమ్మిది జట్లు ఆరు సిరీస్‌లలో ఆడనున్నాయి. స్వదేశంలో మూడు సిరీస్‌లు, విదేశాల్లో మూడు సిరీస్‌లు ఆడాల్సి ఉంటుంది. ప్రతి సిరీస్‌లో 2-5 మ్యాచులను ఆడేందుకు అవకాశం ఉంటుంది. డబ్ల్యూటీసీ-2లో భారత్ విదేశీ సిరీస్‌తో ఆరంభించనుంది. ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా పర్యటనల్లో టెస్టు సిరీస్‌లు ఆడనుంది. స్వదేశంలో శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలతో తలపడనుంది. భారత్, ఇంగ్లాండ్‌లు ఆగస్టు తొలి వారం నుంచి ఐదు టెస్టుల సిరీస్‌లో పోటీపడనున్నారు. ఈ సిరీస్ నుంచే ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-2 ఆరంభం అవనుంది.