Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ద్రవిడ్ కోచింగ్‌పై సంజు శాంసన్
కొలంబో : భారత సీనియర్ జట్టుకు నాణ్యమైన ప్రపంచ శ్రేణి క్రికెటర్లను అందించేందుకు దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ ఏండ్లుగా జూనియర్ క్రికెటర్లకు శిక్షణ సారథ్యం వహిస్తున్నారు. కీలక టెస్టు ఆటగాళ్లు గాయాల బారిన పడిన విపత్కర సమయంలో జూనియర్ క్రికెటర్లు ఆస్ట్రేలియా పర్యటనలో చేసిన వీరోచిత పోరాటం రాహుల్ ద్రవిడ్ తెరవెనుక శ్రమను ప్రపంచానికి తెలియజేసింది. భారత యువ క్రికెటర్లతో రాహుల్ ద్రవిడ్ శ్రీలంక పర్యటనలో ఉన్నాడు. ద్రవిడ్ కోచింగ్ పర్యవేక్షణలో ఆడనుండటాన్ని అదృష్టంగా భావిస్తున్నట్టు వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ సంజు శాంసన్ అన్నాడు. ' భారత్-ఏ, భారత జూనియర్ జట్టులోని ప్రతి ఒక్క క్రికెటర్‌కు రాహుల్ ద్రవిడ్ వంటి కోచ్ ఉండటం అదృష్టం. క్రికెట్ నైపుణ్యాన్ని రాహుల్ ద్రవిడ్ నుంచి నేర్చుకోవటం అదృష్టంగా భావిస్తాం. రాజస్థాన్ రాయల్స్ ట్రయల్స్‌లో ఓ రోజు నేను బాగా బ్యాటింగ్ చేశాను. ద్రవిడ్ నా వద్దకు వచ్చి ' నా జట్టుకు ఆడతావా?' అని అడిగారు. నా జీవితంలో అది మరిచిపోలేని సంఘటన. ద్రవిడ్‌తో సమయాన్ని ఎంతగానో ఆస్వాదిస్తాను' అని సంజు అన్నాడు. భారత్, శ్రీలంక వన్డే సిరీస్ జులై 18 నుంచి ఆరంభం కానున్న సంగతి తెలిసిందే.