Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టోక్యో ఒలింపిక్స్లో కొత్త రూల్స్
టోక్యో : కరోనా దెబ్బకు ఒలింపిక్స్లో అన్ని ప్రభావితం అయినట్టుగానే.. ఒలింపిక్ మెడల్ పోడియం సైతం నూతన రూపు సంతరించుకోనుంది. అథ్లెట్లు, అధికారులు, వాలంటీర్ల ఆరోగ్య భద్రత దృష్ట్యా అంతర్జాతీయ ఒలింపిక్ కౌన్సిల్ (ఐఓసీ) కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. టోక్యో ఒలింపిక్స్లో అథ్లెట్లు, అధికారులు, వాలంటీర్లు ఎల్లవేళలా మాస్క్ ధరించాలి. మెడల్ పోడియంపై స్వర్ణ, రజత మెడలిస్ట్లకు.. స్వర్ణ, కాంస్య మెడలిస్ట్లకు దూరం పెంచనున్నారు. మెడల్ పోడియం ప్రజెంటర్లు అందరూ వ్యాక్సినేషన్ తీసుకున్నావారే. పతకాలు ప్రదానం చేసే సమయంలో ఐఓసీ సభ్యుడు ఒకరు, సంబంధిత క్రీడా సమాఖ్యకు చెందిన అధికారులు మాత్రమే ఉండాలి. పతకాల ప్రదానం అనంతరం మెడలిస్ట్లతో అధికారులు, వాలంటీర్ల గ్రూప్ ఫోటోకు అవకాశం లేదు. కార్యక్రమం పూర్తయ్యే వరకు అథ్లెట్లు తమ మెడల్ పోడియంపైనే నిల్చోవాలి. అక్కడి నుంచే ట్రేలో ఉంచిన మెడల్, బహుమతి తీసుకుని స్వయంగా మెడలో వేసుకోవాలి. ఈ మేరకు ఐఓసీ నూతన నిబంధనలు విడుదల చేసింది.